తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విజయవాడలో భారీగా బంగారం పట్టివేత.. విలువ ఎంతంటే..! - seven crores value gold seized

Gold Seized at Vijayawada Railway Station: విజయవాడ రైల్వేస్టేషన్​తో పాటుగా వివిధల మార్గాల్లో భారీ మొత్తంలో తరలిస్తున్న బంగారం పట్టుబడింది. 12.97 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.7.48 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

gold seized
gold seized

By

Published : Mar 22, 2023, 5:33 PM IST

Updated : Mar 22, 2023, 7:50 PM IST

Gold Seized at Vijayawada Railway Station: అధికారులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా.. బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట కోట్ల విలువ చేసే బంగారం పట్టుబడటం పరిపాటిగా మారిపోయింది. అధికారులు పట్టుకున్న బంగారం మాత్రమే లెక్కలోకి వస్తుంటే.. అసలు అధికారుల కళ్లుగప్పి ఇంక ఎంత అక్రమ వ్యాపారం జరుగుతుందేమోనన్న అనుమానం కలగక మానదు.

విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏడున్నర కోట్ల రూపాయల విలువ చేసే 12 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకునట్లు డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. పక్కా సమాచారం ప్రకారం విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామనీ.. వారి నుంచి 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన నిందితులు విచారణలో మరికొందరు అక్రమ వ్యాపారుల వివరాలు తెలపడంతో వారిని సైతం అరెస్టు చేశారు. మిగతా నిందితులు బంగారాన్ని అక్రమంగా బస్సుల్లో, కార్లలో తరలిస్తున్నట్లు గుర్తించారించామని డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్ కోసం మొత్తం 30 మంది డీఆర్​ఐ సిబ్బంది పాల్గొన్నారు. వారంతా ప్రాథమిక సమాచారం మేరకు వివిధ ప్రాంతాల్లో దాడులు చేశారు. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2022-23 సంవత్సరానికి సుమారు 19 కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్​ఐ అధికారులు వివరించారు. కొంత బిస్కెట్ల రూపంలో.. మరికొంత ఆభరణాల రూపంలోనూ ఉన్నాయని తెలిపారు.

నిత్యం బంగారం ధరలు పెరగడం.. ప్రభుత్వం వివిధ రకాల పన్నులు వేయడంతో.. పన్నుల నుంచి తప్పించుకునేందుకు కొందరు వ్యాపారులు ఈ రకంగా అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా నేత్రాలతో వెంటాడుతున్నప్పటికీ, కొందరు అక్రమ రవాణ కోసం వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎయిర్​పోర్టు, నౌకాశ్రయాలు, రైల్వేస్ ఇలా ఎక్కడ చూసినా అక్రమ దందా చేస్తూ.. ఈ మధ్యకాలంలో చాలా మంది పట్టుబడుతున్నారు. గత కొంత కాలంగా ఎయిర్ పోర్ట్​ల్లో బంగారం పట్టుబడటంతో అక్రమ రవాణా కోసం రైలు, రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డీఆర్ఐ అధికారులకు మెుదట రైల్వే స్టేషన్​లో పట్టుబడిన వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో.. రోడ్డు మార్గం ద్వారా రవాణా చేస్తున్న మరో 7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 22, 2023, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details