తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లాలూ శరీరంలో కదలికలు లేవు.. చెకప్ అయ్యాక దానిపై నిర్ణయం!' - లాలూ ప్రసాద్ యాదవ్ న్యూస్

Lalu Prasad health update: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ శరీరంలో కదలికలు లేవని ఆయన తనయుడు తేజస్వీ యాదవ్ తెలిపారు. ఇప్పటివరకు వైద్యులు చాలా మందులు ఇచ్చారని చెప్పారు. వైద్యులు ఆయన్ను మరోసారి పరిశీలించిన తర్వాత.. ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

lalu prasad yadav health update
lalu prasad yadav health update

By

Published : Jul 7, 2022, 10:46 AM IST

Lalu Prasad health update: రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​కు దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఆయన్ను ప్రత్యేక ఎయిర్ అంబులెన్సులో దిల్లీకి తీసుకెళ్లారు. అయితే, ఆయన పరిస్థితి మెరుగుపడలేదని తెలుస్తోంది. లాలూ శరీరంలో కదలికలు లేవని ఆయన తనయుడు తేజస్వీ యాదవ్ తెలిపారు.

"దిల్లీ ఎయిమ్స్ వైద్యులు లాలూ యాదవ్​కు చాలా రోజుల నుంచి చికిత్స చేస్తున్నారు. నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి అవగాహన ఉన్న వైద్యులు ఇక్కడ ఉన్నారు. ఇంట్లో కిందపడ్డ సమయంలో మూడు చోట్ల ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన శరీరంలో ఎలాంటి కదలికలు లేవు. ఇప్పటివరకు వైద్యులు చాలా మందులు ఇచ్చారు. చెకప్ తర్వాత ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయానికి వస్తాం."
-తేజస్వీ యాదవ్, లాలూ ప్రసాద్ తనయుడు, ఆర్జేడీ నేత

సింగపూర్​కు లాలూ!
లాలూ పరిస్థితి మెరుగుపడకపోతే సింగపూర్ తీసుకెళ్తామని ఇదివరకే తేజస్వీ వెల్లడించారు. కిడ్నీ మార్పిడి చికిత్స కోసం గత నెలలోనే జార్ఖండ్ హైకోర్టు నుంచి లాలూ అనుమతి తీసుకున్నారు. లాలూ కుటుంబాన్ని పరామర్శించేందుకు పలువురు బిహార్ మంత్రులు, రాజకీయ ప్రముఖులు దిల్లీ ఎయిమ్స్​కు చేరుకుంటున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details