పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో యజమానికి చెందిన ఖరీదైన కారును తగలబెట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన నొయిడా సెక్టార్-39లోని సదర్పుర్ కాలనీలో మంగళవారం జరిగింది.
బిస్రఖ్ ఠాణా పరిధిలోని జలాల్పుర్ గ్రామానికి చెందిన రణ్వీర్.. నొయిడాలోని సదర్పుర్ కాలనీకి చెందిన ఆయుష్ చౌహాన్ ఇంట్లో టైల్స్ పని చేశాడు. ఇందుకు సంబంధించి రణ్వీర్కు ఆయుష్ రూ.68వేలు ఇవ్వాల్సి ఉంది. అనేక సార్లు రణ్వీర్ వచ్చి అడిగినా ఆయుష్ డబ్బులు ఇవ్వలేదు.
ఆయుష్ తీరుతో విసిగిపోయిన రణ్వీర్.. మంగళవారం బైక్పై సదర్పుర్ కాలనీకి బైక్పై వచ్చాడు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న మెర్సిడెజ్ బెంజ్ కారుపై పెట్రోల్ పోసి, నిప్పంటించి.. పారిపోయాడు. అయితే.. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు రణ్వీర్ను అరెస్టు చేశారు.