Youth robbed in Goa:హాయిగా ఎంజాయ్ చేసి వద్దామని ఎన్నో ఆశలు పెట్టుకొని గోవాకు వెళ్లిన కొందరు యువకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. గోవా నుంచి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు యువకులను అడ్డగించి లూటీ చేశారు.
ఏమైందంటే...?:మహారాష్ట్ర కొల్హాపుర్ జిల్లాలోని చాంద్గడ్ తాలుకాకు చెందిన 11 మంది యువకులు రెండ్రోజుల క్రితం గోవాకు వెళ్లారు. గోవాలోని వివిధ పర్యటక ప్రదేశాలను, వాటి అందాలను ఆస్వాదించారు.
తిరుగుపయనమైన యువకులను.. గోవా సమీపంలోని బాడుగేశ్వర్ మందిరం వద్ద కొందరు వ్యక్తులు అడ్డగించారు. తమ హోటల్లో మంచి భోజనం పెట్టిస్తామని చెప్పి వీరిని తీసుకెళ్లారు. అనంతరం ఓ గదిలో బంధించారు. యువకుల దుస్తులు విప్పేసి కొట్టారు. అర్ధనగ్నంగా ఉన్న యువకుల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారు. డబ్బులు, మొబైల్ ఫోన్లు, బంగారపు ఉంగరాలు, చైన్లు లాగేసుకున్నారు. వీడియోలను ఆన్లైన్లో పెడతామని బెదిరించారు.