తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డాక్టర్​ కఫీల్​ ఖాన్​పై యోగి సర్కార్​ వేటు- ఆ మరణాలే కారణం!

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​కు చెందిన పిల్లల వైద్యుడు కఫీల్​ ఖాన్​ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2017లో బీఆర్​డీ వైద్య ఆసుపత్రిలో ఆక్సిజన్​ కొరత కారణంగా 70మంది చిన్నారులు మరణించిన ఘటనకు బాధ్యుడ్ని చేస్తూ ఈమేరకు చర్యలు చేపట్టింది.

kafeel khan story
ఖఫీల్​ఖాన్​

By

Published : Nov 11, 2021, 6:43 PM IST

2017 ఉత్తర్​ప్రదేశ్​ ఆసుపత్రిలో చిన్నారుల మరణానికి సంబంధించి కఫీల్​ ఖాన్​ అనే పిల్లల వైద్యుడిని ప్రభుత్వం.. తాజాగా విధుల నుంచి తొలగించింది. ఘటన జరిగిన సమయం నుంచి ఆయన సస్పెన్షన్​లోనే ఉన్నారు.

ఇదీ జరిగింది..

2017 ఆగస్టు 22న గోరఖ్​పుర్​ బీఆర్​డీ వైద్య కళాశాలలోని ఆక్సిజన్​ కొరత కారణంగా 70మంది చిన్నారులు మరణించారు. వార్డు ఇన్​ఛార్జ్​ అయ్యుండి.. ఆక్సిజన్​ కొరతపై అధికారులకు సమాచారం ఇవ్వలేదని, అందుకే చిన్నారులు మరణించారని కఫీల్​ ఖాన్​పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన్ను ప్రభుత్వం వెంటనే సస్పెండ్​ చేసింది.

కఫీల్​పై వచ్చిన నాలుగు ఆరోపణల్లో మూడు నిజమని తేలినట్టు వైద్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అలోఖ్​ కుమార్​ వెల్లడించారు. కఫీల్​ను విధుల నుంచి తొలగించాలని యూపీపీఎస్​సీ(ఉత్తర్​ప్రదేశ్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​) తేల్చి చెప్పిందని వివరించారు. అందువల్ల కఫీల్​ను విధుల నుంచి తీసేశామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కోర్టుకు అందిస్తామన్నారు.

తనను విధుల నుంచి తొలగించడంపై షాక్​ అయినట్టు కఫీల్​ తెలిపారు.

"ఆక్సిజన్​ సప్లయర్లకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం వల్లే ఆ చిన్నారులు మరణించారు. ఈ ఘటనలో 8మంది వైద్యులను సస్పెండ్​ చేశారు. తిరిగి ఏడుగురిని విధుల్లోకి చేర్చుకున్నారు. ఎన్నోసార్లు దర్యాప్తు జరగ్గా, నాకు వ్యతిరేకంగా ఏమీ లేకపోవడం వల్ల కోర్టు నాకు క్లీన్​చిట్​ ఇచ్చింది. దర్యాప్తును నిలిపివేయాలని 2019లోనే ఆదేశాలిచ్చింది. ఇందుకు కోర్టు సమక్షంలోనే ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఇప్పుడు నన్ను తొలగించినట్టు చెబుతున్నారు. ఇది ఆశ్చర్యకరంగా ఉంది. నాకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదు. కోర్టుకు కూడా ఇంకా ఎలాంటి పత్రాలు ఇవ్వలేదు."

--- కఫీల్​ ఖాన్​, వైద్యుడు.

ప్రభుత్వంపై తనకు నమ్మకం పోయిందని, త్వరలోనే ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తానని కఫీల్​ ఖాన్​ వెల్లడించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషిగా బయటకొస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. విద్వేషపూరితమైన అజెండాతో, కఫీల్​ ఖాన్​ను హింసించేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతోందని ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి:-

జైల్లో నన్ను క్షోభ పెట్టారు: కఫీల్​ ఖాన్​

అంతర్జాతీయ స్థాయిలో యోగిపై కఫీల్​ ఖాన్​ పోరాటం!

ABOUT THE AUTHOR

...view details