Kerala youth killed himself: కేరళ ఎర్నాకులంలో ఓ యువకుడు రద్దీ రోడ్డు పక్కన గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొంతు నుంచి రక్తం కారుతుండగానే అదే కత్తితో చెయ్యి కోసుకున్నాడు. యువకుడు ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. సోమవారం సాయంత్రం 6.15 గంటలకు ఈ ఘటన జరిగింది. మృతుడిని క్రిస్టోఫర్గా పోలీసులు గుర్తించారు.
ఆస్పత్రికి తరలించినా...
గొంతు కోసుకున్న అనంతరం కొద్దిసేపు అక్కడే కూర్చున్న అతడు.. కాసేపటికే కిందపడిపోయాడు. స్థానికులు అతడిని గమనించి.. ఆస్పత్రికి తరలించారు. అయితే, యువకుడి ప్రాణాలను వైద్యులు కాపాడలేకపోయారు. అప్పటికే పరిస్థితి విషమించడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు.