దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి స్వల్పంగా తగ్గింది. కేరళలో (Kerala Covid Cases) కొత్తగా 17,983 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 127 మంది మరణించినట్లు తెలిపింది.
అదే సమయంలో 15,054 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారని కేరళ వైద్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,62,846గా ఉందని వివరించింది.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- మహారాష్ట్రలో కొత్తగా 3,286 కేసులు (Covid cases in Maharashtra) వెలుగులోకి వచ్చాయి. 51 మంది కొవిడ్‌కు బలయ్యారు. మరో 3,933 మంది కొవిడ్‌ను జయించారు.
- కర్ణాటకలో 789 కేసులు (Covid cases in Karnataka) బయటపడ్డాయి. 23 మంది కరోనాతో చనిపోయారు. 1,050 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
- దేశరాజధాని దిల్లీలో 24 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క మరణం కూడా సంభవించలేదు.
- మిజోరాంలో కొత్తగా 1,257 కేసులు నమోదవ్వగా, గోవాలో 84 మంది కొవిడ్ బారిన పడ్డారు.