కేరళలో కరోనా (Corona cases) విజృంభణ కాస్త తగ్గింది. ఆ రాష్ట్రంలో కొత్తగా 17,106 కేసులు నమోదయ్యాయి. మరో 20,846 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 83 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 38.03 లక్షలకు చేరింది.
మహారాష్ట్రలో కొత్తగా 4,575 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 145 మంది చనిపోగా.. కొత్తగా 5,914 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
దేశ రాజధాని దిల్లీలో.. 19 మందికి వైరస్ సోకింది. కరోనా కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- తమిళనాడులో 1,652 మంది మహమ్మారి బారిన పడ్డారు. 1,859 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో కొత్తగా 1,350 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,648 మంది కోలుకోగా.. 18 మంది మృతిచెందారు.
- ఒడిశాలో కొత్తగా 911 మందికి కరోనా సోకగా.. 66 మంది ప్రాణాలు కోల్పోయారు.
- గుజరాత్లో 15, ఉత్తర్ప్రదేశ్లో 25, మధ్యప్రదేశ్లో 7 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి.
- పంజాబ్లో మరో 46 కేసులు నమోదు కాగా.. వైరస్ బాధితుల సంఖ్య 6,00,225కి పెరిగింది.
ఇదీ చూడండి:ఒక్కరోజే 7.23 లక్షల కరోనా కేసులు- ఆ దేశంలో ఎమర్జెన్సీ