ఆన్లైన్ డెలివరీలలో ఇటీవల అనేక అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. కేరళకు చెందిన ఎన్ఆర్ఐ నూరుల్ అమీన్.. అమెజాన్ షాపింగ్ సైట్లో ఐఫోన్ 12ను (Apple iPhone 12) ఆర్డర్ చేశాడు. రూ.70,900 చెల్లించి అక్టోబర్ 12న ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే, ఆయనకు వచ్చింది (Amazon different product received) మాత్రం ఐఫోన్ కాదు. డెలివరీ బాక్స్ తెరిచి చూస్తే (Amazon wrong item delivered) అందులో విమ్ సబ్బు, రూ.5 బిళ్ల కనిపించాయి. దీంతో షాక్ అవ్వడం అమీన్ వంతైంది.
అయితే, బాక్స్‌ను తెరిచే ముందు అమీన్.. వీడియో తీశాడు. డెలివరీ బాయ్ ముందే బాక్స్‌ను ఓపెన్ చేశాడు. వీడియో ఆధారంతో సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అమీన్.
కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. అమీన్ ఆర్డర్ చేసిన ఐఫోన్‌ను ఝార్ఖండ్‌లో ఓ వ్యక్తి ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నవంబర్ నుంచే ఈ ఫోన్‌ను ఆ వ్యక్తి వాడుతున్నట్లు తేల్చారు.