ఇంద్రజాలం(magic) అందరికీ నచ్చుతుంది. మాయలతో మైమరిపించే.. ఇంద్రజాలాన్ని కొందరు సాధారణంగా చేస్తే.. మరికొందరు కొత్తగా ప్రయత్నించి ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఆ కోవకు చెందినవాడే కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన మెజీషియన్ అల్విన్ రోషన్. తన ప్రత్యేక ప్రదర్శనతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (Indian Book of Records) చోటు దక్కించుకున్నాడు.
మెజీషియన్ అల్విన్ రోషన్ తలకిందులుగా మ్యాజిక్ చేస్తున్న రోషన్ ఏకంగా.. తలకిందులుగా 4 నిమిషాల 57 సెకన్ల పాటు మ్యాజిక్ చేసి.. ఈ ఘనత సాధించాడు.
మ్యాజిక్ చేస్తున్న అల్విన్ రోషన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ధృవపత్రం రోషన్‌కు చిన్నప్పటి నుంచే మ్యాజిక్ అంటే ఆసక్తి. ఎనిమిదేళ్ల వయసులోనే చిన్న చిన్న ఇంద్రజాల ప్రదర్శనలు చేసి అందరి ప్రశంసలు పొందాడు. ఓసారి అగ్గిపెట్టిలో పుల్లలను మాయం చేసి అబ్బురపరిచాడు. అప్పటినుంచి రోషన్ తల్లిదండ్రులు అతడ్ని ప్రోత్సహించి, ఇంద్రజాలంలో శిక్షణ ఇప్పించారు.
ఇదీ చూడండి:ఆ పూజారిని దేవుడిలా కొలుస్తున్న జనం