తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం- తండ్రి ఆత్మహత్య! - కేరళ రేప్​ న్యూస్​

తన 10 ఏళ్ల కుమార్తెపై ఓ వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడగా.. తట్టుకోలేకపోయాడు ఓ తండ్రి. తీవ్ర మానసిక క్షోభకు గురైన అతడు.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళలో జరిగింది.

victim father commits suicide
లైంగిక వేధింపుల గురైన బాలిక తండ్రి ఆత్మహత్య

By

Published : Oct 25, 2021, 3:31 PM IST

కేరళ కొట్టాయం జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. తన 10 ఏళ్ల కూతురిపై ఓ వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని తట్టుకోలేని ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఏం జరిగింది?

కొట్టాయం జిల్లాలోని కురిచి ప్రాంతానికి చెందిన ఓ కిరాణ దుకాణ యజమాని(74)... కొద్దిరోజుల క్రితం ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సరకులు కొనేందుకు వెళ్లగా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు సదరు బాలికకు నిందితుడు మిఠాయిలు ఇచ్చాడు. అయితే.. తమ కుమార్తె ప్రవర్తనలో తేడా గమనించిన తల్లిదండ్రులు... ఆమెను ప్రశ్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ క్రమంలో సోమవారం బాలిక తండ్రి తన ఇంటి సమీపంలోని ఓ భవనంలో ఉరి వేసుకుని కనిపించాడని పోలీసులు తెలిపారు. తన కూతురిపై జరిగిన ఘోరం తర్వాత.. మానసిక క్షోభకు గురై అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్నిరోజుల నుంచి.. బాలిక కుటుంబాన్ని సమాజం పట్టించుకోలేదని బాధితుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అతడు ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడని వారు ఆరోపించారు.

దీనిపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చూడండి:చికిత్స పేరుతో దివ్యాంగురాలిపై డాక్టర్​ అత్యాచారం

ఇదీ చూడండి:సంతానం కోసం ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు!

ABOUT THE AUTHOR

...view details