తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దారుణం.. ఆరేళ్ల బాలుడ్ని సుత్తితో కొట్టి చంపిన బంధువులు - సుత్తితో మోదీ హత్య

బంధువుల మధ్య గొడవ జరగగా.. ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఆరేళ్ల బాలుడి తలపై సుత్తితో బాది హత్య చేశాడు.

boy beaten to death news
ఆరేళ్ల బాలుడి హత్య

By

Published : Oct 3, 2021, 10:13 AM IST

Updated : Oct 3, 2021, 10:41 AM IST

ఓ కుటుంబంలోని బంధువుల మధ్య గొడవ.. ఆరేళ్ల బాలుడి ప్రాణాన్ని బలిగొంది. బాలుడిని ఓ వ్యక్తి తీవ్రంగా కొట్టి హత్య చేశాడు. కేరళ ఇడుక్కి జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది.

అసలేమైంది?

ఇడుక్కి జిల్లా అనాచల్​కు చెందిన రియాజ్​ కుమారుడు అల్తఫ్​(6). రియాజ్​ కుటుంబ సభ్యులకు, అతడి బంధువులకు మధ్య ఏదో విషయంలో ఆదివారం ఘర్షణ తలెత్తింది.

ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రియాజ్ బంధువు ఒకరు.. అల్తఫ్​ తలపై సుత్తితో బాదాడు. దీంతో అల్తఫ్​ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

మరో చిన్నారి కూడా ఈ ఘటనలో గాయపడ్డాడని సమాచారం.

ఇదీ చూడండి:రూ. 5వేలకు కన్యత్వం అమ్మకానికి..

Last Updated : Oct 3, 2021, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details