తెలంగాణ

telangana

రేషన్ షాపుల్లో నగదు విత్​డ్రా సౌకర్యం.. గ్యాస్​ సిలిండర్లు, పాల ప్యాకెట్లూ కొనొచ్చు

By

Published : May 15, 2023, 5:34 PM IST

రేషన్​ కార్డు ఉందా?.. అయితే మీకో గుడ్​ న్యూస్​. ఇకపై రేషన్​ షాపుల్లోనే మినీ బ్యాంకింగ్​ సిస్టమ్​ అందుబాటులో ఉండనుంది. రూ.10 వేల లావాదేవీలను అక్కడే చేసుకోవచ్చు. 5కిలోల గ్యాస్​ సిలిండర్​, అన్ని నిత్యావసర వస్తువులు అక్కడే సరసమైన ధరలకు దొరకనున్నాయి!

kerala k store
kerala k store

ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేసే ఉద్దేశంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం.. రేషన్​ దుకాణాల రూపురేఖలను మార్చే ప్రాజెక్ట్​ను ప్రారంభించింది. ఆధునిక సాంకేతికతో రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ షాప్​లను హైటెక్ కేంద్రాలుగా మార్చేందుకు సిద్ధమైంది. నగదు విత్​డ్రాల నుంచి.. పాల ఉత్పత్తుల వరకు అన్ని రకాల నిత్యావసర సరకులు ఈ రేషన్ షాపుల్లో కొనుగోలు చేయవచ్చని కేరళ సర్కారు తెలిపింది. ఇందులో భాగంగా తొలి దశలో 108 కే- స్టోర్లు అందుబాటులోకి వచ్చినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ప్రకటించారు.

కేరళలో ప్రారంభమైన కే- స్టోర్లు

కే- స్టోర్​ ద్వారా అందుబాటులో ఉన్న సేవలు!

  • రేషన్​ దుకాణాల్లో మినీ బ్యాంకింగ్​ సిస్టమ్​ను కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రూ.10000 వరకు అన్ని రకాల లావాదేవీలను అక్కడ చేసుకోవచ్చు. ఏటీఎమ్​ కార్డు ద్వారా సొంత ఖాతా నుంచి డబ్బులు కూడా విత్​డ్రా చేసుకోవచ్చు.
  • అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఇక్కడ పూర్తి చేసుకోవచ్చు.
  • విద్యుత్​ బిల్లులు, నీటి బిల్లులు, ఆన్​లైన్​ దరఖాస్తులకు సంబంధించిన రుసుములను కే- స్టోర్​ ద్వారా చెల్లించకోవచ్చు.
  • ప్రజలకు అవసరమైన అన్ని రకాల నిత్యావసర వస్తువులను రేషన్​ కార్డులు ఉన్న వారు తక్కువ ధరలకే ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.
  • కే- స్టోర్​లో అన్ని రకాల పాల ఉత్పత్తులను సరసమైన ధరలకే పొందవచ్చు.
  • ఐదు కిలోల గ్యాస్​ సిలిండర్లను కూడా కేరళ ప్రభుత్వం.. ఈ హైటెక్​ రేషన్​ షాపుల్లో అందుబాటులో ఉంచింది.

K Store Kerala Government : ప్రజా పంపిణీ వ్యవస్థను కాలానుగుణంగా ఆధునీకరించడంలో భాగంగానే ఈ కే- స్టోర్​ ప్రాజెక్ట్​ను కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పయ్యన్నూరు, వెల్లరికుండ్‌ ప్రాంతాలో ఈ ప్రాజెక్ట్​కు సంబంధించిన గౌడౌన్‌లను కూడా నిర్మించింది. అందుకోసం ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు రూ.17 కోట్లు ఖర్చు చేసింది. డోర్​ డెలివరీ కోసం జీపీఎస్​ సిస్టమ్​ను అమర్చింది.

కే- స్టోర్​

ఈ ప్రాజెక్ట్​లో భాగంగా తొలి దశలో 108 కే- స్టోర్లను ప్రారంభించినట్లు సీఎం పినరయి విజయన్​.. తన ఫేస్​బుక్​ పోస్ట్​ ద్వారా ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 14,000 రేషన్ షాపులను కే- స్టోర్లుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. నాణ్యమైన ఆహార పదార్థాలను సరసమైన ధరలకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అధికార ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో కే-స్టోర్‌లను ప్రారంభిస్తోంది.

కే- స్టోర్​ ప్రారంభించిన సీఎం పినరయి విజయన్​

వైద్య సిబ్బందికి భద్రత కల్పించేందుకు కొత్త చట్టం
ప్రభుత్వాసుపత్రిలో వైద్యురాలిపై కత్తితో దాడి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తల భద్రత కోసం కేరళ ప్రభుత్వం ఒక చట్టాన్ని ఆమోదించనుంది. ఆరోగ్య రంగంలోని ఉద్యోగులందరికీ భద్రత కల్పించేందుకు సమగ్ర హాస్పిటల్ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందిస్తోంది. ఆస్పత్రుల్లో హింసకు పాల్పడితే ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించే సెక్షన్లు అమలు అయ్యే విధంగా చట్టాన్ని తయారు చేస్తోంది. నేర తీవ్రతను బట్టి శిక్ష కూడా పెరిగేలా నిబంధనలు చేరుస్తోంది. డాక్టర్లు, నర్సులు, మెడికల్ విద్యార్థులు, పారామెడికల్ సిబ్బంది, ఆస్పత్రి భద్రతా సిబ్బంది ఈ కొత్త చట్ట పరిధిలోకి వస్తారు.

ABOUT THE AUTHOR

...view details