కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సీపీఎం మొదటి జాబితాను ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏ.విజయ రాఘవన్ 83 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా.. ఐదుగురు మంత్రులకు టికెట్లు దక్కలేదు.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మదామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా.. ప్రస్తుత ఆరోగ్యమంత్రి కేకే.శైలజ మత్తనూర్ నుంచి, విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్ థవనూర్ నుంచి బరిలో నిలవనున్నారు. మొత్తం 12 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇక సీట్ల పంపకాల్లో భాగంగా.. కేరళ కాంగ్రెస్కు 13 స్థానాలు కేటాయించారు. మరో మిత్రపక్షం లోక్ తాంత్రిక్ జనతా దళ్(ఎల్జేడీ) మూడు స్థానాల్లో పోటీ చేయనుండగా.. తొమ్మిది స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నట్లు సీపీఎం ప్రకటించింది.