తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో భారీగా కొత్త కరోనా కేసులు- అధికారులతో ఆరోగ్య మంత్రి రివ్యూ - కేరళ కొవిడ్ లేటెస్ట్ న్యూస్

Kerala Covid Cases News : రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్​ను ఎదుర్కునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పింది.

Kerala Covid Cases News
Kerala Covid Cases News

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 9:24 PM IST

Kerala Covid Cases News :రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ప్రభుత్వం పేర్కొంది. వైరస్​ను ఎదుర్కునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు (24 గంటల వ్యవధిలో) 115 కొత్త కేసులు వచ్చినట్లు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,749కి చేరినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్​. ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

'జినోమ్​ సక్వెన్సింగ్​కు పంపించాలి'
కరోనా లక్షణాలతో వచ్చిన శాంపిళ్లను జినోమ్​ సీక్వెన్సింగ్​కు పంపించాలని, కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలని సూచించారు. చికిత్సకు అవసరమైన మందులు, సామగ్రి స్టాక్​ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఇప్పటికే 1,192 ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్పత్రుల్లో డిసెంబర్​ 13 నుంచి 16 వరకు ఆన్​లైన్​ మోక్ డ్రిల్​ను నిర్వహించామన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి నేతృత్వంలో ఆస్పత్రుల సన్నద్ధతపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు.

"కొవిడ్ రోగుల చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఆస్పత్రుల్లో ఐసోలేషన్​ వార్డులు, రూములు, ఆక్సిజన్​, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్స్ ఉండేలా చూసుకోవాలి. విషమంగా లేని రోగులను మెడికల్ కాలేజీలకు పంపించకుండా, స్థానిక ఆస్పత్రుల్లోనే చికిత్స అందిచాలి. కొవిడ్​ పాజిటివ్​గా తేలితే, పరీక్ష చేసిన ఆస్పత్రులోనే వెంటనే చికిత్స అందించాలి. గర్భిణీలు, వృద్ధుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి. ఆస్పత్రి సిబ్బంది, రోగులు, విజిటర్స్​ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి."
--వీణా జార్జ్​, కేరళ ఆరోగ్య మంత్రి

రాష్ట్రంలో 1,957 ఆక్సిజన్​ బెడ్లు, 2,454 ఐసీయూ బెడ్లు, 937 వెంటిలేటర్​ ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్​ కేసుల్లో ఒక వ్యక్తి తప్ప మిగిలిన వారంతా సాధారణ లక్షణాలతోనే ఉన్నారని చెప్పారు. ఇటీవల కరోనాతో మరణించిన వారందరూ 65 ఏళ్లకు పైబడి, క్యాన్సర్, డయాబెటిస్​ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారేనని వివరించారు. ఒక వ్యక్తికి మాత్రమే కొవిడ్ ఉపరకం జెఎన్​. 1 ఒమిక్రాన్​ సోకిందని, అతడు సైతం కొలుకున్నాడని చెప్పారు.

కొత్త కొవిడ్ వేరియంట్ కలవరం- రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

Nipah Virus In Kerala : కొవిడ్​తో పోల్చితే నిఫా చాలా డేంజర్.. ICMR బిగ్ వార్నింగ్!

ABOUT THE AUTHOR

...view details