కేరళలో కరోనా(Kerala Corona Cases) వ్యాప్తి కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 7,540 మంది కరోనా (Kerala Corona Cases) బారిన పడ్డారు. మరో 259మంది మహమ్మారి ధాటికి(Kerala Covid Cases Today) మరణించారు. ఫలితంగా కేరళలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 50,34,858కు చేరగా.. మరణాల సంఖ్య 34,621కు పెరిగింది.
Corona cases: కేరళలో మరో 7వేల మందికి కరోనా
కేరళలో కొత్తగా 7,540 మందికి కరోనా(Kerala Corona Cases) సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా రాష్ట్రంలో ఒక్కరోజే 259 మంది మరణించారు. మరోవైపు.. మహరాష్ట్రలో కొత్తగా 1,338 కరోనా కేసులు వెలుగు చూశాయి.
కేరళ కరనా కేసులు
ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 525మంది మహమ్మారి బారిన పడగా.. ఐదుగురు మరణించారు. దీనితోపాటు మిగతా రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇలా..
- తమిళనాడులో 828 మంది మహమ్మారి బారినపడ్డారు. మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో కొత్తగా 328 కరోనా కేసులు నమోదయ్యాయి. 247 మంది కోలుకోగా.. తొమ్మిది మంది మృతిచెందారు.
- అసోంలో 263 కరోనా కేసులు నమోదుకాగా.. ఒకరు కరోనాతో మరణించారు.
- బంగాల్లో 853 మంది కరోనా కేసులు వెలుగుచూడగా.. మరో 15 మంది కరోనా కారణంగా మరణించారు.
ఇవీ చదవండి: