తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అతడు మా ఆవుల్ని రేప్ చేస్తున్నాడు సారూ.. పోలీసులకు రైతుల ఫిర్యాదు!

ఇటీవలి కాలంలో అత్యాచార ఘటనలు ఎక్కువైపోయాయి. యువతులు, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు.. ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు మూగజీవాలను(Animal Cruelty) సైతం వదలట్లేదు కొందరు ప్రబుద్ధులు. వారిని విచక్షణా జ్ఞానం కోల్పోయి పశువుల్లా(Animal assault) ప్రవర్తిస్తున్నారంటాం. మరి.. ఆ పశువులపైనే అత్యాచారం(Sexual Assault Animals) చేసే వాళ్లను ఏమనాలి? అలాంటి ఘటనే కేరళలో జరిగింది. కానీ ఇదో వింత కేసు..! ఇక్కడేమైందంటే..?

Kerala cattle farmers allege cows being sexually assaulted
ఆవులపై అత్యాచారం, పోలీసులకు రైతుల ఫిర్యాదు

By

Published : Sep 5, 2021, 12:47 PM IST

ఓ మహిళపై అత్యాచారం జరిగింది కాపాడండి.. న్యాయం చేయండి అంటూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కేవారిని చూశాం. కానీ కేరళ కొల్లం జిల్లా మయనాడ్​లోని కొందరు రైతులకు విచిత్ర సమస్య తలెత్తింది. వారంతా.. తమకు జీవనాధారమైన ఆవులను అమ్మేసుకుంటున్నారు. వాటిని జాగ్రత్తగా చూసుకోలేమని వాపోతున్నారు. అదేంటి పశుపోషణతో.. మంచి ఆదాయం ఉంటుందిగా ఇలా ఎందుకు అనుకుంటున్నారా? కారణం ఉంది. తమ ఆవులపై ఓ వ్యక్తి అత్యాచారం (Animal Cruelty) చేస్తున్నాడట. ఇదే గోడు పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత ఏమైందంటే..

ఇక్కడ 20 మంది పశుపోషకులు బాధితులుగా మారారు. 2021 జనవరి నుంచి తరచూ వారి ఆవులపై దాడి (Sexual Assault Animals) జరుగుతోంది. చాలా రోజుల వరకు వారికి అసలు విషయం తెలియలేదు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాకే.. అది లైంగిక దాడి(Animal Assault) అని తెలిసొచ్చింది. ఓ వ్యక్తి రోజూ గోడ దూకి పశువుల కొట్టాల్లోకి రావడం గమనించారు.

భరించలేకపోతున్నాం..

తంబి అనే రైతుకు ఏడు ఆవులు ఉండేవి. వాటిల్లో నాలుగింటిని అమ్మేశాడు. కారణం.. వాటిపై ఐదు సార్లు అత్యాచారం జరగడం. ఆవులను కట్టేసి(Cow Assault) కొట్టడమే కాకుండా నిందితుడు.. వాటి జననాంగాల్లో కర్రలను(Cow Sexual Abuse) చొప్పించేవాడట. పొదుగులను రాళ్లతో కొట్టి గాయపర్చేవాడని ఆరోపించారు రైతులు. వాటికయ్యే చికిత్సను భరించలేకపోతున్నామని, ఇప్పటికీ ఇంజెక్షన్లు వేయాల్సి వస్తోందని దుఃఖిస్తున్నారు.

''ఎవరో వ్యక్తిగత కక్షతో మా ఆవులపై దాడి చేస్తున్నారనుకున్నా. ఆ తర్వాత చాలా మంది రైతులు ఇదే సమస్యను లేవనెత్తారు. అప్పుడే తెలిసింది.. ఈ వ్యక్తి అసహజ రీతిలో ఆవులపై లైంగిక కార్యకలాపాలు సాగిస్తున్నాడని.''

- తంబి, పశుపోషకుడు

పోలీసులకు ఫిర్యాదు.. కానీ!

మిగతా రైతులదీ ఇదే సమస్య. ఇలా మొత్తం 20 మంది కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రంతా కాపలా కాస్తూ ఉండలేమని, నిందితుడి బారినుంచి.. ఆవులను కాపాడుకోలేమని వాపోయారు. అతడ్ని పట్టుకొని.. పోలీసులకు అప్పగించారు.

అయితే.. రైతులు అనుమానిస్తున్న వ్యక్తి మానసిక స్థితి బాలేదని చెప్పి పంపించేశారు పోలీసులు. ఇంకా.. అతడికి వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని చెప్పడం గమనార్హం.

ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఆ సమస్య పరిష్కారం కాని రైతులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇవీ చూడండి: minor gangrape: 15ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

Rape Case : చిన్నారిని చిదిమేసిన మానవ మృగం

Gang Rape : పశువుల పాకలో బాలికపై సామూహిక అత్యాచారం.. అక్కడి నుంచి తీసుకెళ్లి...

ABOUT THE AUTHOR

...view details