ప్రమాదవశాత్తు కారు అద్దంలో మెడ ఇరుక్కొని ఓ నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన కేరళలోని అలప్పుజ జిల్లా(Kerala Alappuzha News) పున్నప్రా గ్రామంలో జరిగింది. బాలుడు వందనం ప్రాంతానికి చెందిన మహమ్మద్ హనన్గా అధికారులు గుర్తించారు.
కారులోకి వెళ్దామని..
సగం తీసి ఉన్న అద్దంలోంచి కారులోకి వెళ్దామని హనన్ అనుకున్నాడు. ఈ క్రమంలో టైరు మీద కాలు వేసి అద్దంలోకి తల పెట్టాడు. అదే సమయంలో టైరు మీద పెట్టిన కాలు జారడం వల్ల అద్దంలో మెడ ఇరుక్కుంది.