పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీని గెలిపిస్తే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 చొప్పున ఇస్తామని (kejriwal promises in punjab) ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన పంజాబ్‌లో (kejriwal punjab visit) పర్యటించారు. పంజాబ్‌లో మహిళల సాధికారత కోసం ప్రత్యేక పథకాలను తీసుకోస్తామని వెల్లడించారు.
kejriwal promises in punjab: ' మమ్మల్ని గెలిపిస్తే మహిళలకు ప్రతి నెల రూ.1000'
పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీని గెలిపిస్తే మహిళల సాధికారత కోసం ప్రత్యేక పథకాలను తీసుకోస్తామని కేజ్రీవాల్ (kejriwal promises in punjab) వెల్లడించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన పంజాబ్‌లో (kejriwal punjab visit) పర్యటించారు.
విద్యా, ఇతర విషయాల్లో మహిళలు ఇతరులపై ఆధారపడకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికి నెలకు రూ.1000 ఇస్తామన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి తోడు ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పంజాబ్‌వ్యాప్తంగా ఉచితంగా వైద్య సదుపాయలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని (aap punjab cm candidate) ఆప్ ఇంకా ప్రకటించనప్పటికీ.. ఆప్ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు భగవంత్ మాన్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు.
ఇదీ చదవండి:యూపీలో పాగా కోసం మజ్లిస్ ఆరాటం.. వంద సీట్లలో పోటీ