తెలంగాణ

telangana

ETV Bharat / bharat

13 శస్త్రచికిత్సలు.. 100కు పైగా ఫ్రాక్చర్స్​.. వైకల్యాన్ని ఎదుర్కొని..

సాధించాలనే తపన ఉంటే వైకల్యం సైతం అడ్డురాదని నిరూపించింది ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ మహిళ. 100కు పైగా ఎముకలు విరిగి.. 13 శస్త్రచికిత్సలు జరిగి 34 ఏళ్లుగా మంచానికే పరిమితమైనా.. ఇవేమి ఆమెకు ఆటంకం కాలేదు. ఈ అవరోధాలను దాటుకొని ఇంటీరియర్​ డిజైనింగ్​ రంగంలో ప్రావీణ్యం సంపాదిండమే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది.

varanasi latest news
varanasi latest news

By

Published : May 5, 2022, 7:45 PM IST

Varanasi Latest News: 13కు పైగా శస్త్రచికిత్సలు..100కు పైగా విరిగిన ఎముకలు.. ఈ పరిస్థితిలో ఉన్న ఎవరైనా జీవితంపై ఆశలు వదులుకుంటారు. నా జీవితం మంచానికే పరిమితమైంది అంటూ బాధపడుతుంటారు. కానీ వారాణాసికి చెందిన ఆస్తా మాత్రం వాటన్నింటిని అధిగమించింది. మంచానికే పరిమితమైన ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ఇంటీరియర్​ డిజైనింగ్​ నేర్చుకుంది. ఆ రంగంలో ప్రావీణ్యం సంపాదించింది. దీంతో పాటు జంతువులకు ఆహరాన్ని అందించడం కోసం ఓ స్వచ్చంధ సంస్థను నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

మంచంపై ఆస్తా
వైకల్యాన్ని జయించి ఇంటీరియర్ డిజైనర్​గా ఎదిగిన ఆస్తా

"చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉన్న ప్రజల ద్వేషాన్ని ఎదుర్కొన్నాను. నా తల్లి సహకారంతోనే ఈ స్థాయిలో ఉన్నా. ఆమె నా కోసం ఎన్నో త్యాగం చేసింది. నన్ను చాలా ప్రోత్సహించేది. ఆహారం అందక అల్లాడుతున్న వీధి జంతువుల కోసం ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నాను."

- ఆస్తా, దివ్యాంగురాలు

"నా కూతురు జీవితం ఎలా ఉంటుందో అని ఆందోళన పడ్డా. కానీ నా కూతురు ఇప్పుడు అనేక మంది ప్రజలకు ఒక ఉదాహరణగా నిలిచింది. ఆస్తా ఆరోగ్యం గురించి వైద్యులు భరోసా ఇవ్వలేదు. ఆమె తన విశ్వాసాన్ని, ధైర్యాన్ని కోల్పోలేదు. జీవితంలోని అనేక కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది."

- ఆస్తా తల్లి

ఉత్తర్​ప్రదేశ్​ వారాణాసికి చెందిన 34 ఏళ్ల దివ్యాంగురాలు ఆస్తాకు కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి సోకింది. నడిచినా.. కూర్చున్నా సరే ఎముకలు విరిగిపోతుంటాయి. ఇలా 100కు పైగా ఎముకలు విరిగిపోయాయి.. 13కు పైగా శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా గదిలో నాలుగు గోడల మధ్య బందీలా ఉండకూడదు అని భావించింది. మంచం పైన నుంచే ఇంటీరియర్​ డిజైనింగ్ నేర్చుకుంది. దీంతోపాటు పలు సామాజిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ తనలాంటి వారికి ప్రేరణగా నిలుస్తోంది.

ఇదీ చదవండి:13 రోజుల తర్వాత విడుదలైన నవనీత్​ రాణా దంపతులు

ABOUT THE AUTHOR

...view details