తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌' ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

Kashi Vishwanath Corridor: ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలో నిర్మించిన 'కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌'ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. 'దివ్యకాశీ-భవ్య కాశీ' పేరుతో జరగనున్న ఈ కార్యక్రమం కోసం కాశీ పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

Kashi Vishwanath temple
కాశీ విశ్వనాథ్ దేవాలయం

By

Published : Dec 12, 2021, 7:19 PM IST

Kashi Vishwanath Corridor: సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు కాశీ క్షేత్ర అభివృద్ధి కారిడార్‌ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. 'కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌'ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు.

విద్యుత్ దీపాల్లో సర్వాంగ సుందరంగా కాశీ ఆలయం
కాశీ ఆలయం
ఆలయంలో భక్తుల రద్దీ

భాజపా పాలిత ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 3వేల మంది సాధువులు, ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలను కూడా ఆహ్వానించారు. 'దివ్యకాశీ-భవ్య కాశీ'గా నామకరణం చేసిన ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 51వేల చోట్ల ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

అన్ని మండలాల్లో ఎల్​ఈడీ తెరలు

ఆలయంలో భక్తుల రద్దీ

దేశంలోని అన్ని మండలాల్లోని ప్రముఖ శివాలయాలు, ఆశ్రమాల్లో ఎల్​ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నారు. కాశీలో సోమవారం నుంచి నెలరోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

కాశీ విశ్వనాథ్ దేవాలయ ప్రాంగణం

సర్వాంగ సుందరంగా కాశీ పట్టణం..

కాశీ క్షేత్ర అభివృద్ధి కారిడార్‌ ప్రారంభోత్సవ నేపథ్యంలో కాశీ పట్టణంలో ఇప్పటికే పండగ వాతావరణం ఏర్పడింది. ఆలయ పరిసరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కాగా, పట్టణ వీధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ఆలయంలో భక్తులు
కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ పనులు

భవనాలు ఒకేలా కనిపించేలా లేత గులాబీ రంగులను వేసి విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. భాజపా శ్రేణులు వీధులను ఊడ్చి పరిశుభ్రతా కార్యక్రమాలను నిర్వహించారు.

కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ పనులకు 2019 మార్చిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ పనుల కోసం రోడ్డు విస్తరణ

70శాతం హరిత ప్రాంతంగా..

ఈ ప్రాజక్టులో భాగంగా కాశీ ఆలయ సమీపంలోని భవనాలను కూల్చివేసి రహదారులను విస్తరించారు. టెంపుల్‌ చౌక్‌, వారణాసి సిటీ గ్యాలరీ, ప్రదర్శన శాల, బహుళ రీతిలో ఉపయోగించుకునే ఆడిటోరియాలు, హాళ్లు, ధ్యాన మందిరం, భక్తులు, అర్చకుల బస కేంద్రాలు, ఆధ్యాత్మిక పుస్తక కేంద్రాన్ని నిర్మించారు.

విద్యుత్ దీపాల్లో కాశీ ఆలయ వైభవం
దర్శనం కోసం భక్తుల ఎదురుచూపు

కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ పనులను 5లక్షల 50వేల చదరపు అడుగుల్లో చేపట్టగా, ఇందులో 70శాతం ప్రాంతాన్ని హరిత ప్రాంతంగా తీర్చిదిద్దారు. విస్తరణ పనుల సమయంలో 40 పురాతన ఆలయాలు బయటపడ్డాయి. వాటిల్లోకి భక్తులను అనుమతించి, పరిరక్షించనున్నారు.

దర్శనం కోసం భక్తుల ఎదురుచూపు

కారిడార్‌ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్షించడం సహా ఇంజనీర్లకు పలు సూచనలు కూడా చేశారు. ఈ ప్రాజక్టు ప్రారంభం తర్వాత కాశీకి భక్తులు, పర్యటకుల సంఖ్య పెరగగలదని భావిస్తున్నారు.

ఇదీ చూడండి:కాంక్రీట్ మిక్సర్​తో పిండి కలిపి వంటలు.. 2లక్షల మందికి అన్నదానం!

ABOUT THE AUTHOR

...view details