కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా కుమట తాలుకాకు చెందిన రెండేళ్ల చిన్నారి తన అద్భుత జ్ఞాపక శక్తితో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఇంత చిన్న వయసులో తమ కూతురు అరుదైన ఘనత సాధించడం పట్ల హెరవత్త వినోద్ రావు, రంజన దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
రెండేళ్ల 'సూపర్ కిడ్'- ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
రెండేళ్ల పసిప్రాయంలోనే అద్భుత జ్ఞాపక శక్తితో అబ్బురపరుస్తోంది కర్ణాటకకు చెందిన ద్యుతి. ప్రముఖ రాజకీయ నాయకులు, క్రికెటర్లు, మహిళలు, జంతువులు, పక్షుల పేర్లు టకాటకా చెప్పి ఆశ్చర్యపరుస్తోంది. 280 అంతర్జాతీయ కంపెనీల లోగోలను గుర్తించగలుగుతోంది. ఫలితంగా అతి చిన్న వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.
రెండేళ్ల చిరు ప్రాయంలోనే ద్యుతి.. 35 జంతువులు, 15 పక్షులు, 12 రంగులు, 30 రకాల చిరుతిళ్లు, 23 రకాల కూరగాయలు, 20 రకాల పండ్లు, 17 రకాల పూలు, 16 వాహనాలను గుర్తించగలుగుతోంది. 20 మంది రాజకీయ నాయకులు, 13 మంది స్వాతంత్ర్య సమర యోధులు, 15 మంది క్రికెటర్లు, 35 మంది సెలబ్రిటీలు, 8 మంది ప్రముఖ మహిళలు, 29 రాష్ట్రాలు, 20 రకాల శునకాల జాతులను టకటకా చెప్పేస్తోంది. ఏబీసీడీలు, 1 నుంచి 10 వరకు అంకెలు, ఇంగ్లీష్ రైమ్స్, రెండు భగవద్గీత శ్లోకాలు, నెలలు, వారాల పేర్లు చెప్పి అబ్బురపరుస్తోంది. అంతేగాకుండా 280 అంతర్జాతీయ కంపెనీల లోగోలను గుర్తిస్తోంది.
ఇదీ చూడండి:video viral: కోడి పిల్లతో కోతి చేష్టలు