కర్ణాటకలో ఓ అమానవీయ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను వివస్త్రను చేసిన కొందరు కామాంధులు ఆమెను లైంగికంగా వేధించారు. అంతేకాకుండా ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు.
8 నెలల క్రితం..
కర్ణాటక యాదగిరి జిల్లాలో(Karnataka Yadgir News) ఎనిమిది నెల క్రితం మహిళపై ఈ దారుణం జరిగింది. అయితే.. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో ఆదివారం వైరల్గా మారగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆధారంగా నలుగురు నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే.. మహిళపై వేధింపులకు గల కారణాలపై స్పష్టత వస్తుందని చెప్పారు.
"ప్రాథమిక దర్యాప్తులో ఈ ఘటన 8 నెలల క్రితం జరిగినట్లుగా తేలింది. కానీ, నిందితులు మాత్రం ఏడాదిన్నర క్రితం జరిగిందని చెబుతున్నారు. దీనిపై షాహన్పుర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మేము ఈ కేసును తీవ్రంగా పరిగణించి, మొత్తం నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకన్నాం."