తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్క కామెంట్​తో కల సాకారం.. ఆస్పత్రి బెడ్ నుంచి స్టార్​ మోడల్​గా... - మలబార్ గోల్డ్​ అండ్​ డైమండ్ యాడ్​

ఆ అమ్మాయికి మోడల్​గా మారడం చిన్ననాటి కల. ఖరీదైన నగలు, దుస్తులు ధరించి నటించటం అంటే ఎనలేని ఇష్టం. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమెకు అరుదైన గుండె జబ్బు కూడా ఉంది. అయినా ఆ అమ్మాయి.. మలబార్ గోల్డ్​ అండ్​ డైమండ్​కు మోడల్​ అయింది. ఎలాగంటే..

Dhanya
మలబార్​కు మోడల్​

By

Published : Sep 8, 2021, 7:22 PM IST

మలబార్​కు మోడల్​గా మారిన యువతి

ఒక్క కామెంట్.. ఒకరిని మోడల్​గా మార్చేస్తే? కరీనా కఫూర్​, అనిల్​ కఫూర్​ వంటి స్టార్స్​తో కలిసి నటించే స్థానానికి చేర్చితే? అబ్బో ఊహే భలే​ ఉంది కదా! కేరళ ఇడుక్కికి చెందిన ధన్య జీవితంలో ఈ ఊహ నిజం అయింది. ఒక ప్రకటన​ కింద తాను పెట్టిన కామెంట్​తో ఒక్కసారిగా స్టార్​గా మారింది.

పాండ్యమక్కల్​ ధన్య(21)కు మోడల్​ కావడం చిన్ననాటి కల. ఖరీదైన నగలు, దుస్తులు ధరించి నటించటం అంటే ఎంతో ఇష్టం. కానీ ఆమె అరుదైన గుండె జబ్బుతో బాధపడుతోంది. ఆసుపత్రి బెడ్​పై ఉండే.. ఓ రోజు మలబార్​ జువెలరీ యాడ్​ చూసింది ధన్య. అందులో కరీనా కఫూర్​, అనిల్ కఫూర్​ నటించారు. ఆ యాడ్​ కింద 'నాకు అలాగే నటించాలని ఉంది' అని కామెంట్​ పెట్టింది ధన్య. దీంతో అడ్వర్టైజ్​మెంట్​ టీం సభ్యులు ధన్యను కలిసి యాడ్​లో నటించమని అడిగారు. మరుసటి వారమే షూటింగ్​కు సిద్ధం కావాలని చెప్పారు. యాడ్ షూటింగ్​​ కోసం కొచ్చికి వెళ్లిన ధన్య.. ఖరీదైన వజ్రాలు, నగలు ధరించి నటించింది.

ధన్య స్టోరీతో ఓ చిన్న వీడియోను సిద్ధం చేశాడు ఫిల్మ్​ మేకర్ రోహన్ మాథ్యూ​. ఆ వీడియోను కరీనా కఫూర్​ తన ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అయింది. దీంతో ధన్యకు చాలామంది శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇదీ చదవండి:తాత కోసం బాలిక సాహసం- 240 కి.మీ నడుస్తూ...

బోస్‌ కోసం భర్తను చంపిన సమరయోధురాలు

ABOUT THE AUTHOR

...view details