తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్రామీణ జీవితాన్ని కళ్లకుగట్టే రాక్​ గార్డెన్​ - కర్ణాటక న్యూస్

పట్టణాలకు వలసలు పెరుగుతున్న వేళ పల్లెలన్నీ బోసిపోతున్నాయి. నగరీకరణ ముసుగులో పంచె కట్టు మరిచిన పల్లె జనం.. మూలాలు మరిచిపోతున్నారు. పశు సంరక్షణ భారమై వ్యవసాయం డీలా పడి పచ్చదనం బీడు బారిపోతోంది. కవుల భావనలు చిత్రకారుల కుంచెలకే పరిమితమైన పల్లె పథం.. నేటి తరానికి వినపడని పదంగా మారుతోంది. కానీ ఈ పరిస్ధితుల్లోనూ అచ్చమైన పల్లె పరిమళాన్ని ఆస్వాదించాలంటే కర్ణాటకకు వెళ్లాల్సిందే.

karnataka rock garden
గ్రామీణ జీవితాన్ని కళ్లకుగట్టే రాక్​ గార్డెన్​

By

Published : Aug 21, 2021, 10:44 AM IST

గ్రామీణ జీవితాన్ని కళ్లకుగట్టే రాక్​ గార్డెన్​

ఇది కర్ణాటకలోని నాలుగవ జాతీయ రహదారిపై హవేరి-హుబ్బళ్లి జిల్లాల మధ్యలోని గొట్టగొడి గ్రామం. దాసనూరు ఉత్సవ్ రాక్ గార్డెన్ పేరిట ఇక్కడ నిర్మించిన ఓ అందమైన పార్కు వీక్షకులను కట్టిపడేస్తుంది. పార్కులో అడుగు పెట్టినప్పటి నుంచి బయటికి వెళ్లే వరకు గ్రామీణ జీవనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ రాక్ గార్డెన్‌లో దాదాపు వెయ్యికిపైగా కళాకృతులు పల్లె జీవనానికి సజీవ దృశ్యాలుగా దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబానికి ప్రతీకగా నిలిచే మర్రిచెట్టు కళాకృతి పార్కులోకి వచ్చే వారికి స్వాగతం పలుకుతుండగా.. ఆపై ప్రతి కళాఖండం జీవం ఉట్టిపడే రూపాలతో మైమరపిస్తాయి. దగ్గరికి వెళ్లి చూస్తే తప్ప అది జీవంలేని రూపమని నిర్ధరించలేని విధంగా.. అక్కడి శిల్పకళా రూపాలను తీర్చిదిద్దారు.

గ్రామీణ జీవితాన్ని కళ్లకుగట్టే రాక్​ గార్డెన్​

ఆలోచనలకు రూపం..

కర్ణాటక రాక్​ గార్డెన్​

కర్ణాటకకు చెందిన చిత్రకారుడు టీబీ సొలబక్కనవర్ ఆలోచనలకు.. ఆయన కుమార్తె వేదరాణి, అల్లుడు దాసనూరు ప్రకాష్‌ వాస్తవ రూపం ఇచ్చారు. ఈ రాక్‌గార్డెన్‌ 12 ఏళ్లుగా సాధారణ వీక్షకుల నుంచి కళాకారుల వరకు అందరి హృదయాలను కట్టిపడేస్తోంది. అందుకే ఇప్పటివరకు లిమ్కాబుక్, ఇండియా బుక్‌తోపాటు వరల్డ్ అమేజింగ్ వంటి 8 రికార్డులు ఈ రాక్‌గార్డెన్‌కు దక్కాయి. కళ కేవలం ధనికులే కాదు.. సామాన్యులు కూడా ఆస్వాదించేలా ఉండాలని ఈ కళామందిరాన్ని నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉపాధి కరవైన కళాకారులకు ఇక్కడ ఏడాదంతా ఉపాధి దొరుకుతుందని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ గ్రామ సమాజం స్ఫూర్తితో అక్టోబర్ 2న ఈ గార్డెన్ ప్రారంభించినట్లు వివరించారు.

రాక్​ గార్డెన్​

శిల్పకళారూపాలు..

గ్రామీణ జీవితాన్ని కళ్లకుగట్టే రాక్​ గార్డెన్​

ఈ చిత్రాలు కేవలం కళను వ్యక్తపరిచేవి కావు.. ఉమ్మడి కుటుంబానికి ప్రతీకలంటారూ ఈ గార్డెన్‌ క్యురేటర్‌ వేదారాణి. ఇక్కడ నిర్మించిన డాక్టర్‌ రాజ్‌కుమార్‌ సర్కిల్‌లో కొలువైన ఆయన సినీపాత్రలు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయి. అక్కడ ఉన్నవి బొమ్మలే అయినా మానవసంబంధాలను కళ్లముందు కనిపించేలా చేస్తాయి. సిమెంట్, రాతితో రూపొందించిన ఈ శిల్పకళారూపాలు చిన్నాపెద్దలను ఆద్యంతం అలరిస్తున్నాయి.

రాక్​ గార్డెన్​

ఈ రాక్‌గార్డెన్ సందర్శకుల్లో గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రజలు కూడా ఎక్కువ. పిల్లలతోపాటే పట్నం వలస వచ్చిన వారు ఈ వనంలోకి వచ్చి సేదతీరుతుంటారు. ఇక్కడి వాతావరణాన్ని చూస్తూ.. అప్పటి తమ గ్రామాలతో పోల్చుకొని సంబరపడుతుంటారు. వివాహ వేడుకల్లో బంధుగణం, గ్రామీణ క్రీడలు, కుస్తీ పోటీలు సాక్షాత్కరించేలా తీర్చిదిద్దారు. ధాన్యాల ఆరబోత, సంత, పశువుల విక్రయం, కమ్మరి, వడ్రంగి, కుమ్మరి పనులు వ్యవసాయాన్ని గుర్తుచేస్తాయి. ఇలా మట్టి వాసనను పరిమళించే పల్లె జీవితాన్ని ఉత్సవ్ రాక్ గార్డెన్ కళ్లకు కట్టేలా చేస్తుంది.

గ్రామీణ జీవితాన్ని కళ్లకుగట్టే రాక్​ గార్డెన్​

కళలపై ఆసక్తి లేని వారు కూడా.. ఇక్కడి కళాకృతులను చూస్తే మురిసిపోవాల్సిందే. చిత్ర, శిల్ప, రంగస్థల, ఆధునిక చిత్రకళలకు ఈ రాక్‌గార్డెన్ నెలవు. తమ మూలలను వెతికే వారి కోసం ఓ చక్కని వేదిక కాగలదని నిర్వాహకులు తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ సంస్కృతిని చాటే పార్కులు చేస్తామని వెల్లడించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ కాకుండా నేరుగా హస్త కళాకారుల శ్రమతోనే ఈ గార్డెన్ నిర్మించినట్లు తెలిపారు.

గ్రామీణ జీవితాన్ని కళ్లకుగట్టే రాక్​ గార్డెన్​

ఇదీ చూడండి:ప్రపంచంలోనే డేంజరస్ స్కైవే- 59ఏళ్ల తర్వాత రీఓపెన్​

ABOUT THE AUTHOR

...view details