కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంక్రీట్ మిక్సర్ లారీ అదుపు తప్పి ఓ కారుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మృతులను గాయత్రి(47), సమత కుమార్(16)గా పోలీసులు గుర్తించారు.
అదుపు తప్పి కారుపై బోల్తా కొట్టిన లారీ బెంగళూరుకు చెందిన గాయత్రి అనే మహిళ తన కూతురు సమతతో కలిసి బన్నేరుఘట్ట రోడ్డుపై స్విఫ్ట్ కారులో వెళ్తోంది. అప్పడు బన్నేరుఘట్ట వైపు వస్తున్న ఓ కాంక్రీట్ మిక్సర్ లారీ అదుపు తప్పి.. కారుపై పడింది. పోలీసులు.. నాలుగు క్రేన్లు, ఒక జేసీబీ సాయంతో కారుపై ఉన్న లారీని బయటకు తీశారు. అప్పటికే గాయత్రి, సమత మరణించినట్లు గుర్తించారు. మృతురాలు గాయత్రి ఐటీ ఉద్యోగి అని పోలీసులు తెలిపారు.
అదుపు తప్పి కారుపై బోల్తా కొట్టిన లారీ గోదాంలో పేలుడు..
మహారాష్ట్ర ఠాణెలో దారుణం జరిగింది. బీడీ తాగి.. తుక్కు గోదాంలోని ఓ కెమికల్ డ్రమ్‌పై పడేశాడు ఓ వ్యక్తి. దీంతో భారీ పేలుడు సంభవించి ఇద్దరు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం ఉదయం జరిగిందీ ఘటన. మృతులను గోదాంలో పనిచేసే ఖురేషీ(46), ఇష్రాయిల్ షేక్ (35)గా పోలీసులు గుర్తించారు. ఈ పేలుడు సంభవించిన సమీప ప్రాంతాల్లో కిటీకీలు ధ్వంసమయ్యాయి.
పికప్ వ్యాన్-ట్రక్కు ఢీ..
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్, ట్రక్కు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. బుర్హాన్‌పుర్ గ్రామ సమీపంలో బుధవారం జరిగిందీ ఘటన. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు బుర్హాన్‌పుర్ రోడ్డు ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.