Karnataka Omicron Restrictions: ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న వేళ నూతన సంవత్సర వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగంగా జరిగే వేడుకలను నిషేధించింది. అపార్ట్‌మెంట్‌లలో డీజేల వినియోగంపై కూడా నిషేధం విధించింది. అంతర్గత ప్రదేశాల్లో 50శాతం సామర్థ్యంతో వేడుకలకు అనుమతినిచ్చింది.
" రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటాన్ని నిషేధిస్తున్నాం. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి."
-- బసవరాజు బొమ్మై, కర్ణాటక సీఎం