తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ నేడే! - బసవరాజ బొమ్మై క్యాబినెట్

కర్ణాటక నూతన మంత్రివర్గం కొలువుదీరేందుకు ముహూర్తం సిద్ధమైంది. కేబినేట్ ఏర్పాటు అంశంపై అధిష్ఠానంతో చర్చించిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. నేడు తుది జాబితా ఖరారు అవుతుందని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు.

Basavaraja
Basavaraja

By

Published : Aug 4, 2021, 5:48 AM IST

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మంత్రివర్గం కొలువుదీరనుంది. కేబినెట్ ఏర్పాటుకు భాజపా అధిష్ఠానం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో.. ఈరోజు సాయంత్రం నూతన మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే తొలి విడతలో పూర్తిస్థాయి కేబినెట్ కాకుండా.. 20-24మందితోనే మంత్రివర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున.. కేంద్ర నాయకత్వం తీరికలేకుండా ఉందని బొమ్మై తెలిపారు. అంతేగాక ఇతర సమస్యల కారణంగా మంత్రివర్గ ఏర్పాటులో జాప్యం జరిగిందని వివరించారు. దిల్లీ పర్యటనలో భాగంగా భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పార్లమెంటులో సమావేశమైన బొమ్మై మంత్రివర్గ విస్తరణపై చర్చించారు.

"తుది జాబితాలో ఎంతమందికి చోటు కల్పించాలనే అంశంతో పాటు.. ఉప ముఖ్యమంత్రి పదవిని కొనసాగించాలా లేదా అనే అనే అంశంపై లోతైన చర్చ జరిగింది. వీటిపై కేంద్ర నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత బీఎస్ యడియూరప్పతోనూ చర్చిస్తుంది. ఇవి పరిష్కారమైతే తుది జాబితా ఖరారవుతుంది. మొత్తంగా ప్రాంతీయ, సామాజిక అంశాల ఆధారంగా ఈ జాబితా ఉండనుంది. ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల తుది జాబితాను పార్టీ అధిష్ఠానం పంపుతుంది. అది రాగానే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది."

-బసవరాజ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి

డిప్యూటీ సీఎం పోస్ట్ కష్టమే..

రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి ఏర్పాటుకు అధిష్ఠానం సుముఖంగా లేదని తెలుస్తోంది. దీనివల్ల సీనియర్లతో పాటు.. ఆశావహుల్లో అనవసరమైన గందరగోళం ఏర్పడవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అయితే మంత్రుల జాబితా విడుదలతో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక సీనియర్ నేతలతో పాటు.. ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరిన వారికి మంత్రి పదవి దక్కుతుందా అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని వెల్లడించారు. అనుభవం, యువత సేవలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ కూర్పు ఉంటుందని తెలిపారు.

'యడ్డీ' వర్గానికి ప్రాధాన్యం!

నూతన మంత్రులుగా మాజీ సీఎం యడియూరప్ప సిఫార్సు చేసిన పేర్లను అధిష్ఠానం పరిగణలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details