రోజూ స్కూల్కు వెళ్తూ స్నేహితులతో ఉత్సాహంగా ఆడుకునే వయసులో ఓ చిన్నారి జీవచ్ఛవంలా మారాడు. బ్రెయిన్ ఫీవర్ కారణంగా పక్షవాతం బారినపడి.. ఆపై కోమాలోకి వెళ్లాడు. చిన్నారి ఆరోగ్యం బాగుపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేని సమయంలో 'ఈటీవీ భారత్' ప్రచురించిన ఓ కథనం ఆ చిన్నారికి అండగా నిలిచేలా చేసింది. సోషల్ మీడియాలోని ఓ గ్రూప్ చిన్నారికి సాయం అందిస్తామంటూ ముందుకొచ్చింది.
ఉత్తర కన్నడ జిల్లా అంబర్దా గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల శైలేశ్ కృష్ణ బ్రెయిన్ ఫీవర్ కారణంగా కొంతకాలంగా కోమాలో ఉంటున్నాడు. చిన్నారిని ఉత్తర కన్నడ సహా ధార్వాడ్, హుబ్లీ జిల్లాల్లోని పలు ఆస్పత్రుల్లో చూపించారు. కానీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. మంగళవారం ఈ క్రమంలోనే చిన్నారి కుటుంబం.. శైలేశ్ను నందగద గ్రామంలోని ఓ చర్చి వద్దకు తీసుకెళ్లి ప్రార్థించారు.