కర్ణాటక రామనగర్‌లోని కంచుగల్ బండె మఠానికి చెందిన బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసు రోజురోజుకు మలుపు తిరుగుతోంది. లింగయత్ స్వామిని ఓ మహిళ హనీట్రాప్ చేసి.. మనసికంగా హింసించిందని పోలీసులు గుర్తించారు. ఆ ఒత్తిడి, వేధింపుల వల్లనే స్వామీజీ ఆత్మహత్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు.
స్వామీజీ మృతి కేసులో ట్విస్ట్.. తెరపైకి హనీట్రాప్ యాంగిల్ - రామనగర్ లేటెస్ట్ న్యూస్
కర్ణాటకలో కంచుగల్ బండె మఠాధిపతి మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. స్వామీజీని కొందరు ఓ మహిళను అడ్డం పెట్టుకుని ట్రాప్ చేశారని.. ఆ ఒత్తిడి, వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని ప్రాథమికంగా తేల్చారు.
కేసు గురించి రామనగర్ ఎస్పీ సంతోష్ బాబు మాట్లాడుతూ.. "స్వామీజీ తన డెత్ నోట్‌లో కొందరి పేర్లను ప్రస్తావించారు. అయితే.. ఆయన మరణానికి, సూసైడ్ నోట్‌లో ఉన్న వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. మరో అజ్ఞాత వ్యక్తిని ప్రస్తావిస్తూ.. ఆయన మాటలకు అసహ్యం వేస్తోందని రాశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది" అని తెలిపారు. మాగడిలోని కుదూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైనా.. నిందితులుగా ఇంకా ఎవరి పేర్లూ పేర్కొనలేదని చెప్పారు. స్వామీజీ నిజంగానే వేధింపులకు గురి అయ్యారా? లేదా? అన్నది తెలియాల్సి ఉందని.. కేసులో ఎవరెవరు ఉన్నారనేది దర్యాప్తు ద్వారా తెలుస్తుందని ఎస్పీ సంతోష్ తెలిపారు.
అయితే.. ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన కేసులో మురుగ మఠంలోని చీఫ్ పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు నిందితుడు. శివమూర్తి అరెస్టైన తరవాత.. 45 ఏళ్ల బసవలింగేశ్వర స్వామి నిందితుల వలలో చిక్కుకున్నారని.. వారి వేధింపుల వల్లనే స్వామి బలవన్మరణానికి పాల్పడ్డారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.