తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా రోబోలు! - టీచర్లుగా రోబోలు

Robots as Teachers: ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు స్కూళ్లలోనే అన్ని హంగులూ సదుపాయాలు ఉంటాయనేది చాలా మంది అభిప్రాయం. కానీ ఈ స్కూల్​ను చూస్తే ఆ ఆలోచనే మారిపోతుంది. మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని రోబోను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం.

Robots as Teachers
టీచర్లుగా రోబోలు

By

Published : Mar 24, 2022, 9:58 PM IST

Updated : Mar 24, 2022, 10:35 PM IST

Robots as Teachers: ఈ డిజిటల్​ యుగంలో.. విద్యార్థులకు శ్రమ తెలియకుండా పాఠాలు చెప్పి వారి సందేహాలు తీర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేసింది. రోబో సినిమాలో చిట్టీలాగ.. పిల్లలకు ఆసక్తికరంగా పాఠాలు చెప్పడమే కాక వారు అడిగిన డౌట్లను టక్కున క్లియర్​ చేసేందుకు ఓ రోబోను తీసుకొచ్చింది. ఈగల్​ పేరుతో ఈ రోబోను బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టింది. ఈ రోబోను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వత్​ నారాయణ బుధవారం ఆవిష్కరించారు.

పాఠం చెప్తున్న రోబో

అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్న క్రమంలో స్కూళ్లలో ఈ తరహా రోబోలు ప్రవేశపెట్టడం చాలా అవసరమని మంత్రి అశ్వత్​ నారాయణ పేర్కొన్నారు. రోబో అనేది టీచర్లకు ప్రత్యామ్నాయం కాదని అది వారికి పనికి సహకరించేందుకేనని చెప్పిన మంత్రి.. ఈ రోబోల ద్వారా బోధనలో నాణ్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. వివిధ అంశాలపైన కన్నడ, ఇంగ్లీషు భాషల్లో పాఠాలు చెప్తూ.. అడిగిన సందేహానికి వెంటనే సమాధానం చెప్తున్న రోబోను చూసి విద్యార్థులతో పాటు టీచర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ రోబోతో తాము మరింత సులువుగా పాఠాలు వినవచ్చని విద్యార్థులు ఉత్సాహపడుతున్నారు.

రోబోతో మంత్రి అశ్వత్​ నారాయణ​, విద్యార్థినులు

ఈ ఈగల్​ రోబోను త్వరలో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ముందు కూడా ప్రదర్శించనున్నారు. ఈ రోబోలను మల్లేశ్వరంలోని ఇతర ప్రభుత్వ పాఠశాల్లో కూడా ప్రవేశపెట్టాలని తాము భావిస్తున్నామని.. కాబట్టి ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమల్లోకి తేవాలని ఆశిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల్లోని విద్యా ప్రమాణాల్లో మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ఇదీ చూడండి :ఆమెకు 67.. అతడి వయసు 28.. నోటరీ చేయించిమరీ సహజీవనం!

Last Updated : Mar 24, 2022, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details