దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్- కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోల్‌కతా, బెంగళూరులో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కోల్‌కతాలోని ఐసీఎంఆర్-ఎన్ఐసీఈడీలో తుది దశ ప్రయోగాలను ప్రారంభించారు బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్.
దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ ట్రయల్స్‌కు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రెండు డజన్ల కేంద్రాల్లో ఎన్ఐసీఈడీ ఒకటని తెలిపారు ధన్ఖర్. ఈ ప్రక్రియ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కేవలం దేశంలోని దూరదృష్టి గల నాయకత్వంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు.
బంగాల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఫర్హాద్ హకీమ్.. కొవాగ్జిన్ తుది దశ ట్రయల్స్‌లో భాగంగా టీకా వేయించుకున్న తొలి వలంటీర్‌గా నిలిచారు. అనంతరం.. ఆయన మాట్లాడారు.
''టీకా ట్రయల్స్‌లో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. టీకా వేయించుకున్నాక నేను బాగానే ఉన్నా. ఇందులో భాగంగా నేను చనిపోయినా పట్టించుకోను.''