మధ్యప్రదేశ్లో అధికార భాజపా- విపక్ష కాంగ్రెస్ మధ్య మరోమారు మాటల యుద్ధం నెలకొంది. 28 అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు.. ఈ నెల 10న వెలువడనున్న తరుణంలో ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ నుంచి ఫోన్లు వస్తున్నాయని.. వారితో బేరసారాలు ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు.
"భాజపా ఎమ్మెల్యేలను కాంగ్రెస్- కమల్నాథ్ సంప్రదిస్తున్నారు. వారికి ఎరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బేరసారాలు ఆడుతున్నారు. వాటితో ఎలాంటి లాభం లేదు. మధ్యప్రదేశ్ రాజకీయాలను కమల్నాథ్ భ్రష్టు పట్టించారు."