తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటనపై వెనక్కి తగ్గుతున్నట్టు చేసిన ప్రకటనపై మక్కల్‌నీది మయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. రజనీ చేసిన ప్రకటన.. ఆయన అభిమానుల్లాగే తననూ ఎంతో నిరాశకు గురిచేసిందన్నారు. అదే సమయంలో ఆయన ఆరోగ్యం కూడా తనకెంతో ముఖ్యమన్నారు.
'రజనీ ప్రకటన నన్నూ నిరాశపరిచింది' - undefined
కొత్త పార్టీ ఏర్పాటుపై వెనక్కి తగ్గుతున్నట్టు సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటనపై మక్కల్‌నీది మయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. రజనీ ప్రకటన తనను ఎంతో నిరాశకు గురిచేసిందన్నారు.
‘రజనీ ప్రకటన నన్నూ నిరాశపరిచింది’
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న కమల్.. ప్రచారం ముగిసిన తర్వాత రజనీకాంత్‌ను కలుస్తానని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ కమల్ హాసన్ ప్రస్తుతం తిరుచ్చిలో మూడో విడత ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.
Last Updated : Dec 29, 2020, 8:31 PM IST
TAGGED:
rajani