తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాట 154 స్థానాల్లో కమల్ పార్టీ పోటీ - TN polls

తమిళనాడు ఎన్నికల్లో 154 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తెలిపారు. ఇండియా జననాయక కట్చి, ఆలిండియా సమతువ మక్కల్ కట్చితో కలిసి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పార్టీలకు చెరో 40 సీట్లు కేటాయించారు.

kamal-haasan-forms-third-front-keeps-154-gives-ijk-aismk-40-seats-each
కమల్ థర్డ్ ఫ్రంట్- సీట్ల కేటాయింపు పూర్తి

By

Published : Mar 9, 2021, 5:54 AM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా జననాయక కట్చి, ఆలిండియా సమతువ మక్కల్‌ కట్చితో కలిసి బరిలో దిగుతున్నామని ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ వెల్లడించారు. తమ పార్టీ 154 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కూటమిలోని రెండు పార్టీలకు తలో 40 స్థానాలు కేటాయించినట్లు తెలిపారు.

అటు, డీఎంకే తన కూటమిలోని పార్టీలకు సీట్ల కేటాయింపుపై స్పష్టతనిచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు పూర్తి కాగా... తాజాగా సీపీఎంకు ఆరు సీట్లను కేటాయించింది. మరో మూడు స్థానిక పార్టీలకు ఒక్కో స్థానాన్ని కట్టబెట్టింది. ఈ మూడు పార్టీలు డీఎంకే గుర్తుతోనే పోటీ చేస్తాయని పేర్కొంది.

మరోవైపు, టీటీవీ దినకరన్‌కు చెందిన అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీతో ఎంఐఎం పార్టీ పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా ఎంఐఎం తమిళనాడులో మూడు స్థానాల్లో పోటీ చేయనుంది. వానియంబాడీ, శంకరాపురం, కృష్ణగిరిలో ఎంఐఎం బరిలో దిగనున్నట్లు ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు వకీల్ అహ్మద్ ప్రకటించారు.

ఇదీ చదవండి:కమల్​ నోట 'థర్డ్​ ఫ్రంట్​' మాట

ABOUT THE AUTHOR

...view details