తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కబడ్డీ ఆటగాడిని కాల్చిచంపిన దుండగులు - పంజాబ్​ వార్తలు తాజా

Kabaddi Player Sandeep Nangal: పంజాబ్​లోని జలంధర్​లో ఓ కబడ్డీ ఆటగాడు హత్యకు గురయ్యాడు. మలియన్​ కలన్​ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్​ జరుగుతున్న సమయంలో నలుగురు దుండగులు ఆటగాడిని కాల్చిచంపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

sandeep nangal
సందీప్​ నంగల్

By

Published : Mar 15, 2022, 4:14 AM IST

Updated : Mar 15, 2022, 6:20 AM IST

Kabaddi Player Sandeep Nangal: సందీప్​ నంగల్ అనే అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఈ ఘటన పంజాబ్​లోని జలంధర్​ జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది.

హత్యకు గురైన సందీప్​ నంగల్

ఇదీ జరిగింది..

సోమవారం సాయంత్రం.. షాకోట్‌లోని మలియన్ కలన్ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో సందీప్ నంగాల్‌పై నలుగురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. షాకోట్‌లోని అంబియాన్ గ్రామానికి చెందిన సందీప్.. కుటుంబంతో సహా ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డారని.. అప్పుడప్పుడు స్థానికంగా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తుంటారని పోలీసులు వెల్లడించారు. టోర్నీ జరుగుతున్న ప్రదేశం నుంచి సందీప్ బయటకు రాగానే నిందితులు అతనిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. సందీప్‌ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించినట్లు వెల్లడించారు. సందీప్​ తల, ఛాతీ భాగంలో 8 నుంచి 10 బుల్లెట్లు దూసుకుపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనావేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి :ఏడు పదుల వయసులోనూ.. డ్రైవింగ్​పై బామ్మకు తగ్గని ఆసక్తి

Last Updated : Mar 15, 2022, 6:20 AM IST

ABOUT THE AUTHOR

...view details