ఒక మహిళా న్యాయవాది నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడం చరిత్రాత్మకమని, అటువంటి అరుదైన గౌరవాన్ని జస్టిస్ ఇందు మల్హోత్ర సొంతం చేసుకున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే అన్నారు. ఆమె తీర్పులు న్యాయ పరిజ్ఞానంతో తొణికిసలాడుతుంటాయని తెలిపారు. జస్టిస్ ఇందు మల్హోత్ర శనివారం పదవీ విరమణ చేయనున్న సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టులో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జస్టిస్ ఎస్.ఎ బోబ్డే, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న ఆమెతో పాటు ధర్మాసనంలో ఆసీనులయ్యారు.
2007లో సీనియర్ న్యాయవాది హోదాను పొందిన ఇందు మల్హోత్ర 2018 ఏప్రిల్ 26న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పదవీ విరమణ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. బార్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన జస్టిస్ ఇందు మల్హోత్ర.. ''నా శక్తిమేరకు న్యాయ వ్యవస్థకు సేవలందించిన సంతృప్తితోనే పదవీ విరమణ చేస్తున్నా'' అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:'వృద్ధుల చికిత్సకు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే'