వ్యాక్సినేషన్‌పై (Vaccination in India) కేంద్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul gandhi news). ఇలా తప్పుడు ప్రచారాలు చేసి, అసత్యాలు చెప్పి ప్రజల్ని కాపాడలేరని విమర్శించారు. DutyToVaccinate అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
కాంగ్రెస్ అధినేత్రి (Congress news today) సోనియా గాంధీ ఓ వార్తాపత్రికకు రాసిన కథనాన్ని ట్విట్టర్లో షేర్ చేసి.. రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో 100 కోట్ల టీకా డోసుల మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో.. సోనియా అభిప్రాయం ఆ కథనంలో ఉంది. భారత శాస్త్రవేత్తలు, పరిశోధకులను ఆ సందర్భంగా అభినందించిన ఆమె.. పిల్లలు సహా దేశంలో ఇంకా చాలా మంది కొవిడ్ టీకా వేసుకోలేదని తెలిపారు.
'భారత్‌లో ఇంకా 68 కోట్ల మందికిపైగా అసలు వ్యాక్సిన్ తీసుకోలేదని, ఒక్క డోసు కూడా పొందలేదని' ఉన్న ఓ వెబ్సైట్ గణాంకాల్ని కూడా.. రాహుల్ గాంధీ(Rahul gandhi news) ట్విట్టర్లో షేర్ చేశారు.
సోనియా కథనాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన కాంగ్రెస్(Congress news today) .. సార్వత్రిక ఉచిత టీకా విధానానికి భాజపా ప్రభుత్వం దూరంగా ఉందని ఆరోపించింది.