July 27 horoscope : నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి - రాశి ఫలాలు
ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
రాశి ఫలాలు
By
Published : Jul 27, 2021, 3:59 AM IST
ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
చేపట్టిన పనులను చక్కటి ప్రణాళికతో పూర్తిచేస్తారు. కీలక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సలహాలు మంచినిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివారాధన చేస్తే మంచిది.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. గురు నామాన్ని జపిస్తే మంచిది.
భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రమపెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. శివారాధన శుభప్రదం.
తోటివారి సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. గణపతిని ఆరాధిస్తే మంచిది.
అనుకున్న పనిని వెంటనే పూర్తి చేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.
సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. పెద్దలతో మర్యాదగా వ్యవహరించాలి. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ సమభావంతో చూడడం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. గోసేవ చేస్తే మంచిది.
కీలక విషయాల్లో శ్రద్ధ చూపండి. ఖర్చుల విషయంలో పొదుపును పాటించాలి. అకారణ కలహ సూచన ఉన్నది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. శివనామాన్ని జరిపించాలి.
పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. సమయం అనుకూలంగా ఉంది. అప్పుల బాధ పెరగకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి వారి ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది.
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు చర్యలొద్దు. చేపట్టే పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఎవరినీ ఎక్కువగా నమ్మరాదు. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభదాయకం.
అనుకున్న పనులను పూర్తిచేస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
పెద్దల సలహాలు శక్తినిస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శని శ్లోకం చదవాలి.
ధర్మసిద్ధి ఉంది. మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలున్నాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఇష్టదైవారాధన వల్ల మేలు జరుగుతుంది.