JNU VC News: దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) తొలి మహిళా వీసీగా డా.శాంతిశ్రీ ధూళిపూడి పండిత్ నియమితులయ్యారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ సదరు వీసీ విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కారణం.. అందులో వ్యాకరణ దోషాలు దొర్లడమే. దీంతో భాషా నైపుణ్యాల విషయంలో ఆమెపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. భాజపా ఎంపీ వరుణ్ గాంధీ సైతం దీనిపై స్పందించారు. శాంతిశ్రీ ప్రకటనను పోస్ట్ చేస్తూ.. 'జేఎన్‌యూ వీసీ నుంచి వచ్చిన ఈ పత్రికా ప్రకటన నిరక్షరాస్యతను ప్రదర్శిస్తోంది. ఇది వ్యాకరణ దోషాలతో నిండి ఉంది. ఇటువంటి నియామకాలు.. మానవ వనరులను, యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయి' అని ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లూ ఈ ప్రకటనలోని లోపాలను ఎత్తిచూపారు.
JNU VC News: జేఎన్‌యూ వీసీ ప్రకటనపై వరుణ్ గాంధీ విమర్శలు - జేఎన్‌యూ వీసీ వివాదాస్పద ప్రకటన
JNU VC News: దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) తొలి మహిళా వీసీగా డా.శాంతిశ్రీ ధూళిపూడి విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అందులో వ్యాకరణ దోషాలు దొర్లడమే ఇందుకు కారణం. దీంతో భాషా నైపుణ్యాల విషయంలో ఆమెపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు.. శాంతిశ్రీకి చెందినదిగా చెబుతోన్న ఓ ట్విటర్ ఖాతాలోంచి గతంలో అనేక ద్వేషపూరిత పోస్ట్‌లు వచ్చాయంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇందులో నాథూరామ్ గాడ్సే, రైతు చట్టాలు, లవ్ జిహాద్ వంటి అంశాలపై వివాదాస్పద ట్వీట్లు ఉన్నట్లు పేర్కొంటున్నారు. సదరు ట్వీట్లు, వాటికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, అధికారికంగా గుర్తింపు లేని ఆ అకౌంట్‌ను నిన్ననే డీయాక్టివేట్ చేయడం గమనార్హం. జేఎన్‌యూకు ఇదివరకు ఉప కులపతిగా వ్యవహరించిన ఎం.జగదీష్ కుమార్‌ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కు ఛైర్మన్‌గా నియమించడంతో.. ఆయన స్థానంలో శాంతిశ్రీ బాధ్యతలు స్వీకరించారు. జేఎన్‌యూ పూర్వ విద్యార్థిని అయిన ఆమె.. ఇందులోనే ఎంఫిల్‌తోపాటు అంతర్జాతీయ సంబంధాలపై పీహెచ్‌డీ చేశారు.
ఇదీ చదవండి:'జేఎన్‌యూ'కు తొలి మహిళా వీసీ.. తెలుగు వారే!