ఝార్ఖండ్‌లోని సరాయికేలాలో తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్న మహిళను పోలీసులు రక్షించారు. ఎవరో తనను ఎత్తుకెళ్లి నెలరోజుల పాటు బంధించారని, 60 మంది తనపై అత్యాచారం చేసినట్లు ఆమె చెప్పిందని తెలిపారు.
"చాండిల్ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో విషమ పరిస్థితిలో ఉన్న మహిళను గుర్తించాం. ఆమె శరీరంపై చాలా గాయాలున్నాయి. మతిస్థిమితం లేదని అనుమానిస్తున్నాం. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించాం. అయితే తనను ఎవరో దుండగులు అపహరించారని ఆమె ఆరోపించింది. అరవై మంది తనపై అత్యచారం చేశారని చెప్పింది."