జేఈఈ మెయిన్స్ నాలుగో విడత ఫలితాలను(JEE MAINS RESULTS) విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ). ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 44మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో 18 మంది అభ్యర్థులు టాప్ ర్యాంకును సాధించారు. మొత్తం 9,34,602 మంది అభ్యర్థులు అర్హత సాధించిన ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులూ సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి దుగ్గినేని వెంకటపనీష్, పసల వీరశివ, కంచనపల్లి రాహుల్ నాయుడు, కర్నం లోకేశ్‌లు మొదటి ర్యాంక్ కైవసం చేసుకోగా.. తెలంగాణ నుంచి కొమ్మ శరణ్య, జోస్యుల వెంకటాదిత్యకు తొలిస్థానం దక్కింది.
వీరితోపాటు.. రాజస్థాన్ నుంచి సిద్ధాంత్ ముఖర్జీ, అన్షుల్ వర్మ, మృదుల్ అగర్వాల్, దిల్లీ నుంచి రుచిర్ బన్సాల్, కావ్య చోప్రా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అమయ్య సింఘాల్, పాల్ ఉన్నారు అగర్వాల్, పంజాబ్ నుంచి పుల్కిత్ గోయల్, చండీగఢ్ గురమృత్ సింగ్, గౌరబ్ దాస్ (కర్ణాటక), వైభవ్ విశాల్ (బీహార్)లు తొలిస్థానం సాధించారు.