JEE Main 2023 Notification: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్-2023 పరీక్ష తేదీల కోసం లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ ను జాతీయ పరీక్షల మండలి గురువారం విడుదల చేసింది.
రెండు విడతల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్‌టీఏ.. జనవరిలో తొలి విడత, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. జేఈఈ మెయిన్ తొలి సెషన్‌ను జనవరి 24, 25, 27, 29, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనుండగా.. రెండో సెషన్‌ను ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. జేఈఈ మెయిన్ పరీక్షను 13 భాషల్లో (ఆంగ్లం, హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళ్, ఉర్దూ) నిర్వహించనున్నారు.