జమ్ముకశ్మీర్ నాలుగో విడత స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 41.94శాతం పోలింగ్ నమోదైంది.
జమ్ముకశ్మీర్లో ప్రశాంతంగా ముగిసిన 'స్థానిక' పోలింగ్
14:55 December 07
12:06 December 07
జమ్ముకశ్మీర్లో ఉదయం 11 గంటల వరకు 26.02 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు.
10:00 December 07
జుమ్ముకశ్మీర్లో నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.16శాతం ఓటింగ్ నమోదైంది.
08:53 December 07
బుధాల్, మంజాకోట్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఓటర్లు.
08:48 December 07
బుద్గాం జిల్లా నర్బాల్ ప్రాంతంలో ఓటేసేందుకు క్యూలో నిలబడ్డారు ప్రజలు. స్థానిక పాలనతోనే తమ ప్రాంతంలో అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
08:42 December 07
నాలుగో విడత పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు కశ్మీర్ ప్రజలు. బాజల్తాలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద క్యూలో నిలబడ్డారు. ప్రశాంతంగా ఓటు వేస్తున్నారు.
06:48 December 07
కశ్మీర్లో డీడీసీ ఎన్నికల పోలింగ్
జమ్ముకశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల(డీడీసీ)కు నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 34 స్థానాలకు 249మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7లక్షల మందికిపైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాాత్రమే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశముంది. మొత్తం 1,910 పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు చేశారు అధికారులు.
నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా ఖాళీగా ఉన్న 50 సర్పంచ్ స్థానాలకు కూడా పోలింగ్ జరగుతోంది. 137 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలను 8 విడతల్లో నిర్వహిస్తోంది ప్రభుత్వం. నవంబర్ 28, డిసెంబర్1, డిసెంబర్ 4న మొదటి మూడు దశల పోలింగ్ పూర్తయింది.