తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పర్యటకులను ఆకర్షిస్తోన్న 'తులిప్​' అందాలు - జమ్ముకశ్మీర్​లో తులిప్​ గార్డెన్​

ఆసియాలో అతి పెద్ద తులిప్‌ ఉద్యానవనం భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్‌లోని ఇందిరా గాంధీ మెమోరియల్‌ తులిప్‌ గార్డెన్‌ రంగురంగుల పువ్వులతో కళకళలాడుతోంది. కరోనా కారణంగా గతేడాది తెరుచుకోని ఉద్యానవనం.. ప్రకృతి ప్రేమికులకు గురువారం నుంచి తిరిగి స్వాగతం పలుకుతోంది.

Tulip garden
తులిప్​ గార్డెన్​

By

Published : Mar 25, 2021, 7:00 PM IST

శ్రీనగర్‌లోని జబర్వాన్‌ పర్వత ప్రాంతంలో ఉన్న ఆసియాలోనే అతిపెద్దదైన ప్రసిద్ద ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్‌ గార్డెన్‌ సందర్శకుల కోసం గురువారం తెరుచుకుంది. కరోనా కారణంగా గతేడాది వెలవెలబోయిన ఈ తులిప్ గార్డెన్.. ఇప్పుడు పర్యటకులకు ఆహ్వానం పలుకుతోంది. చుట్టూ అందమైన పర్వతాలు.. ఆకాశంలో కమ్ముకున్న మేఘాలు.. కనుచూపుమేర రంగురంగుల తులిప్‌ అందాలతో ఆకట్టుకుంటోంది.

తులిప్​ గార్డెన్​లో పర్యటకులు

ఈ గార్డెన్‌లో 64 రకాల్లో మొత్తం 15 లక్షల తులిప్ మొక్కలు ఉన్నాయి.

తులిప్​ అందాలు
తులిప్​ గార్డెన్​లో పర్యటకుల సందడి
గార్డెన్​లో యువతుల ఫొటో షూట్​

2008లో ప్రారంభం..

సిరాజ్ బాగ్‌గా పిలుచుకునే ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్​ను 2008లో అప్పటి జమ్ముకశ్మీర్ సీఎం గులాం నబీ ఆజాద్ ప్రారంభించారు. పర్యటక మాసం ప్రారంభానికి గుర్తుగా ఏటా గార్డెన్‌లోకి సందర్శకులను అనుమతిస్తారు. మూడు నుంచి నాలుగు వారాల పాటు జీవంతో ఉండే ఈ తులిప్‌ అందాలను ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు.

తులిప్​ గార్డెన్​

ప్రత్యేక ఏర్పాట్లు..

కరోనా పరిస్థితుల నేపథ్యంలో పర్యటకుల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. థర్మల్ స్కానింగ్, శానిటైజర్‌లను అందుబాటులో ఉంచారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు.

మాస్క్​ తప్పనిసరి అని ఏర్పాటు చేసిన బోర్డు

ఇదీ చూడండి:3000 అడుగుల 'మోదీ ముగ్గు'తో ప్రపంచ రికార్డ్

ABOUT THE AUTHOR

...view details