Man killed lover: రాజస్థాన్ జైపుర్‌లోని హసన్పురలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలు, ఆమె సోదరుడ్ని దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ హత్యలకు పాల్పడిన నిందితుడి పేరు గుల్షాన్. హసన్పురలో నివాసముండే 17 ఏళ్ల పూనం , ఇతను కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం ఆమెను కలిసేందుకు వెళ్లాడు. అనంతరం ఇద్దరూ ఏదో విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే కోపంలో గుల్షాన్ పూనంపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అడ్డువచ్చిన ఆమె సోదురుడిని కూడా తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. చనిపోయిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేయసి, ఆమె సోదరుడ్ని చంపి పోలీస్ స్టేషన్‌కు
ప్రియురాలు, ఆమె సోదరుడ్ని దారుణంగా హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రాజస్థాన్ జైపుర్‌లో ఈ ఘటన జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన మరో ఘటనలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మైనర్‌పై గ్యాంగ్‌రేప్..:ఉత్తర్‌ప్రదేశ్ రుధౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లినప్పుడు పొదల్లోకి లాక్కెళ్లి ఈ క్రూర చర్యకు పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఇంటికి వెళ్లాక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:మహిళ వీరంగం.. పోలీసులపై చెప్పుతో దాడి