Jaipur girl child rape case: రాజస్థాన్లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. జైపుర్లోని శాస్త్రి నగర్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మైనర్లిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. శుక్రవారం వారు కాలనీలో ఆడుకుంటుండగా.. బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు బాలుడు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బాలిక ఏడుపు వినిపించి కుటుంబ సభ్యులు పరుగున వెళ్లి చూశారు. బాధితురాలిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చేపట్టారు.