తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆపరేషన్​ కశ్మీర్ 2.0'లో కీలక ముందడుగు! - జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌

జమ్ముకశ్మీర్​లో నియోజకవర్గాల విభజనకు రంగం సిద్ధం కానుంది. అందుకోసం నియోజకవర్గాల పునర్‌విభజన కమిషన్‌ జులై 6 నుంచి 9 మధ్య కశ్మీర్​లో పర్యటించనుంది. అక్కడి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించనుంది.

J-K delimitation commission
ఆపరేషన్​ కశ్మీర్ 2.0

By

Published : Jun 30, 2021, 3:28 PM IST

Updated : Jun 30, 2021, 3:41 PM IST

జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్‌విభజనకు కార్యాచరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏర్పాటైన కమిషన్‌ జులై 6 నుంచి 9 వరకు జమ్ముకశ్మీర్‌లో పర్యటించనుంది. విభజన ప్రక్రియపై అక్కడి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల నుంచి కమిషన్‌ ప్రాథమిక అభిప్రాయం సేకరించనుంది.

కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ చంద్ర మధ్య సమావేశం తర్వాత పర్యటనపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్‌విభజన చేపట్టాలన్న కమిషన్‌ ప్రయత్నానికి అంతా సహకరిస్తారని, ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేందుకు తమ విలువైన సలహాలు అందిస్తారని ఈసీ విశ్వాసం వ్యక్తం చేసింది.

Last Updated : Jun 30, 2021, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details