తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రస్థావరం ధ్వంసం- పేలుడు పదార్థాలు స్వాధీనం - జమ్మూకశ్మీర్ వార్తలు ఆన్​లైన్

పోలీసులు, సైన్యం సంయుక్త ఆపరేషన్​లో జమ్ముకశ్మీర్​లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఘటనా స్థలం నుంచి పెద్దఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

J&K: Doda police and army claimed to have busted a militant hideout
జమ్మూ​లో నక్కిన ఉగ్రవాదులు.. పేలుడు పదార్థాలు స్వాధీనం

By

Published : May 7, 2021, 10:48 AM IST

Updated : May 7, 2021, 11:42 AM IST

జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలోని ఘాట్ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాన్ని కనుగొన్నారు పోలీసులు, సైన్యం. చక్రంతి గ్రామ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నట్లు సమాచారం అందగా.. పోలీసులు-సైన్యం సంయుక్తంగా దాడి చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఈ క్రమంలో ఉగ్రస్థావరాన్ని ధ్వంసం చేసి.. భారీగా పేలుడు పదార్థాలను కనుగొన్నారు. ప్లాస్టిక్ సంచిలో ఉంచిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉగ్రవాదులే అవి అక్కడ ఉంచినట్లు అనుమానిస్తున్నారు. అయితే దోడాలో ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాలు చురుకుగా లేవని.. ఒక్క ఉగ్రవాది కూడా యాక్టివ్​గా సీనియర్​ అధికారి చెప్పారు.

గతంలో ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు తమ కార్యకలాపాల కోసం ఉపయోగించినట్లు అనుమానిస్తున్న సొరంగాన్ని పోలీసులు కనుగొన్నారు.

ఈ దాడిలో పోలీసులు 4 డిటోనేటర్లు, ఒక బ్యాటరీ(12వోల్టు), 50 మీటర్ల ఎలక్ట్రిక్ వైర్, రెండు ప్రెజర్ కుక్కర్లలో నింపిన ఐఈడీ, ఆర్డీఎక్స్ నింపిన రెండు పైపు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:జమ్ముకశ్మీర్​లో​ ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో పాక్​ చొరబాటుదారుడు హతం

జమ్ముకశ్మీర్​లో రూ.50కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత

Last Updated : May 7, 2021, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details