తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) నేతృత్వంలోని కూటమి సమాయత్తమవుతోంది. మిత్రపక్షాలైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్), మనితనీయ మక్కల్ కచీ(ఎంఎంకే) పార్టీలు.. సీట్ల పంపకం ఒప్పందంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమక్షంలో సోమవారం సంతకం చేశాయి. ఐయూఎంఎల్ మూడు స్థానాల్లో, ఎంఎంకే రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారించాయి.
తాము మొత్తం ఐదు స్థానాలు కోరగా.. ఇతర మిత్రపక్షాల ఒత్తిడి కారణంగా మూడు సీట్లను కేటాయించేందుకు డీఎంకే అంగీకరించిందని ఐయూఎంఎల్ అధ్యక్షుడు ఎం కాదర్ మొహిదీన్ తెలిపారు. తమకు రెండు సీట్లు కేటాయించారని ఎంఎంకే నేత ఎంహెచ్ జహీరుల్లా పేర్కొన్నారు.